vikasita main page

vikasita
ఐటీ....ఈ తరానికి కలల పంట. హోదా. అంతస్తు, సంపాదన, గౌరవం - ప్రతి ఒక్కరూ ఊహించుకునే చిత్రమిది. కాని నాణేనికి రెండో వైపున ఎదురీతలెన్నో. చదువు, సీటు,ఉద్యోగం,ప్రమోషన్, స్థిరత్వం, కుటుంబం అన్నీ సమస్యలే. మానసిక వేదనలు, సామాజిక సంక్షోబాలు, రాజకీయ నాటకాలు వెంటాడుతున్న నీడలు. ప్రేమ, పెండ్లి... గజబిజి. వ్యాపార సంస్క్రతి మోసుకొస్తున్న ఒంటరి, విచ్చల విడి తనం. జవాబుల్లేక మిగిలిపోతున్న అనేకానేక ప్రశ్నలు.

యువతరంలో ఉద్బవిస్తున్న నూతన సంఘర్శణలు. ఈ సంఘర్శణలో నుండి పుట్టుకొస్తున్న నూతన భావాలు. ఆ భావాలకు ప్రతీకలుగ మరో క్రొత్త తరం.పాత, కొత్తల మధ్య అగాధం. ఈ సంధి యుఘంలో మంచి మార్గం కోసం అన్వేషణ.

ఈ భావ సంఘర్శణల ప్రతిబింబమే "వికసిత" .సామాజిక పురిటిగడ్డలో ఉద్భవించి, వికసించిన పరిమళం.... నిత్య, అక్షయ్, రాజమౌళి, ఆకశ్, అశ్విత.... ఈల ఎన్నో పాత్రలు. వర్తమాన వీచికలు.

చదవండి.... వికసిత ఆధునిక సమచార యుగానికి ప్రతీక..
రచయిత: వీయస్సార్ [కాలమిస్ట్, జర్నలిస్ట్].